Big Breaking: కాంగ్రెస్ బహిరంగ సభకు ముహూర్తం ఫిక్స్

by Anukaran |   ( Updated:2021-11-30 02:56:36.0  )
Congress Public meeting
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అధిష్టానం శుభవార్త చెప్పింది. డిసెంబర్ 12వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బహిరంగ సభలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ కార్యనిర్వాహక వర్గ సభ్యులు, సీనియర్ నేతలు, అన్ని రాష్ట్రాల పీసీసీలు, కాంగ్రెస్ ఎంపీలు, సీఎల్పీ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. పెరిగిన ధరలకు నిరసనగా ఇటీవలే దేశ వ్యాప్తంగా జనజాగరణ్ అభియాన్ నిర్వహించిన కాంగ్రెస్, ప్రస్తుతం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

Next Story

Most Viewed