‘ఐలా’ ఉనికిని కాపాడండి..

by  |
‘ఐలా’ ఉనికిని కాపాడండి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారిశ్రామిక వాడల అభివృద్ధి కోసం నిర్దేశించిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ( ఐలా) ఉనికిని కాపాడాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్(MSME) ఇండస్ట్రీస్ అసోసియేషన్ శుక్రవారం కోరింది. ఐలాలకు సంబంధించిన కమిటీలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో TSIIC మాత్రమే పనులను నిర్వర్తిస్తుందని అధ్యక్షుడు కేవీ రామేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏ భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.శివసాంబిరెడ్డిలు చెప్పారు.

ఇదివరకు వేసిన కమిటీలు అలాగే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటైన కమిటీలకు అధికారాలు ఉండాలని సూచించారు. అందుకే ఐలా సొసైటీల అధికారాలను పునరుద్ధరించాలని కోరారు. అలాగే పరిశ్రమలకు బకాయి పడిన సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లో సీవరేజ్ సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు.

ఇటీవల కురిసిన వర్షాలకు ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం వివరించారు. పారిశ్రామిక వాడల్లో ఆస్తి, నివాసాలపై పన్నులను వేర్వేరుగా విధించాలన్నారు. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి ఏకరవు పెట్టారు. వెంటనే సీవరేజ్ లైన్లను ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ వెంకటరాంరెడ్డిలను మంత్రి ఆదేశించినట్లు అధికారుల బృందం ప్రకటించింది.


Next Story

Most Viewed