కోహ్లీ కాదు.. ధోనీ అంటే ఇష్టం : రష్మిక

80

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకు చాలా ఇష్టమని, అతడంటే పడి చచ్చిపోతానని నటి రష్మిక మందాన అన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని ఒక అభిమాని ప్రశ్నించగా ధోనీ అని చెప్పింది. ‘ధోనీ బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం. అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్’ అని చెప్పుకొచ్చింది. కాగా, రష్మిక ఫేవరెట్ క్రికెటర్ ధోనీ అయినా.. తాను మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సపోర్ట్ చేస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలో కూడా ఆర్సీబీకి మద్దతుగా పోస్టులు పెట్టింది. దీంతో కోహ్లీ తన ఫేవరెట్ ప్లేయర్ అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ రష్మిక అనూహ్యంగా ధోనీ పేరు చెప్పడంతో కోహ్లీ ఫ్యాన్స్ హర్టయ్యారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..