టీఆర్ఎస్ లీడర్ దారుణ హత్య.. అర్ధరాత్రి బండరాయితో మోది..!

by  |
rajireddy 1
X

దిశ, జగిత్యాల : టీఆర్ఎస్ లీడర్ దారుణ హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ పడాల మమత భర్త పడాల రాజిరెడ్డి (45) దారుణంగా హతమయ్యాడు. మండల కేంద్రంలోని రమేష్ అనే వ్యక్తి అర్ధరాత్రి బండ రాయితో దాడి బలంగా కొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం రాజిరెడ్డిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

వివరాల్లోకివెళితే.. రాజిరెడ్డి సోదరుడు, రమేష్‌ అనే వ్యక్తి మధ్య మంగళవారం రాత్రి గొడవ జరిగింది. ఇదే విషయంపై చర్చిస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఉన్న రమేశ్ రాజిరెడ్డిని బండరాయితో బలంగా కొట్టడంతో చనిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్థలికి చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మండల కేంద్రానికి చెందిన ప్రజాప్రతినిధి భర్త దారుణ హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story

Most Viewed