జూన్-17: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు దిగొచ్చిన బంగారం ధరలు

by Mallepaka Hamsa |   (  Updated:2024-06-17 05:56:14  IST  )

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు ఉంటే కచ్చితంగా విక్రయిస్తారు.

జూన్-17: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు దిగొచ్చిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు ఉంటే కచ్చితంగా విక్రయిస్తారు. అయితే గత కొద్ది కాలంగా పసిడి ధరలు అమాంతం పెరుగుతూ.. కొనుగోలు దారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. దీంతో విక్రయాలు కాస్త తగ్గాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల తర్వాత భారీగా పెరుగుతూ.. మహిళలకు కునుకు లేకుండా చేస్తున్నాయి.

నిన్నటితో పోల్చుకుంటే.. నేడు బంగారం ధరలు కాస్త తగ్గి మహిళలకు గుడ్ న్యూస్ తెలిపాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 తగ్గడంతో రూ. 66,300కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.220 తగ్గగా రూ. 72,330కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి విషయానికొస్తే రూ. 95, 600 లతో స్థిరంగా కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,300

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,330

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,300

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,330

Next Story