- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల దుర్మరణం
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ : హైదరాబాద్ నగరశివారులో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు దొంతం కవిత, భర్త వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్-విజయవాడ హైవే మీద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటలకు నల్లగొండ నుంచి ఎంపీటీసీ దంపతులు స్కార్పియో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. సరిగ్గా (విజయవాడ – హైదరాబాద్ […]</p>

దిశ ప్రతినిధి, నల్లగొండ : హైదరాబాద్ నగరశివారులో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు దొంతం కవిత, భర్త వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్-విజయవాడ హైవే మీద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటలకు నల్లగొండ నుంచి ఎంపీటీసీ దంపతులు స్కార్పియో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. సరిగ్గా (విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి) పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ చేరుకొని యూటర్న్ తీసుకునే సమయంలో కారు ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో స్కార్పియో కారు వేగంగా టిప్పర్ వెనకాల భాగాన్ని ఢీ కొనడంతో ఎంపీటీసీ దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి.
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దంపతులను కారులో నుంచి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇది ఇలా ఉంటే గతవారమే ఎంపీటీసీ కూతురు వివాహాన్ని నల్లగొండలో అంగరంగ వైభవంగా జరిపించారు తల్లిదండ్రులు. దీంతో ఇరు కుటుంబాలు, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.






