వ్యాక్సిన్ వేసుకోవాలని గ్రామస్తుడి ఇంటి ఎదుట ఎంపీడీవో నిరసన

by  |
MPDO Yadagiri
X

దిశ, నేరేడుచర్ల : కరోన వైరస్ వ్యాప్తిని నివారించేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది గ్రామగ్రామం తిరుగుతూ ఇంటింటికీ వ్యాక్సిన్ అందించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ కొంత మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు జంకుతున్నారు. ఏదో ఓ సాకు చూపించి తప్పించుకుంటున్నారు. అలాంటి వారందరికీ అధికారులు అవగాహన కల్పించి టీకాలు వేస్తున్నారు. అయితే సోమవారం సూర్యాపేట జిల్లాలో ఓ వింత సంఘటన జరిగింది.

కరోనా వ్యాక్సిన్ క్యాంపియన్‌లో భాగంగా పాలకీడు మండల కేంద్రంలో ఎంపీడీఓ జానయ్య, ఎంపీవో దయాకర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఏఎన్ఎం సుశీల, విజయ, ఆశ వర్కర్లు స్వప్న, స్వాతి, కవిత, అంగన్‌వాడీ టీచర్‌తో సహా ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకోని వారికి అందిస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొండ చిన్న అచ్చయ్య ఇప్పటి వరకు మెుదటి డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. ఆయనకు వ్యాక్సిన్ వేసేందుకు ఇంటికి వెళ్లగా అధికారులను చూసిన కొండ చిన్న అచ్చయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తాను టీకా వేసుకోనని మొండికి వేశాడు. అయితే ఎంపీడీవో సహా సిబ్బంది అంతా కొండ చిన్న అచ్చయ్య ఇంటి ముందే కూర్చోని నిరసన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే వరకు ఇంటి ముందు నుంచి కదలమని భీష్మించుకుని నిరసన తెలిపారు. అధికారులు అలా గంటల తరబడి కూర్చున్నా.. అచ్చయ్య మాత్రం తలుపులు తీయలేదు.

Next Story

Most Viewed