- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘200 మొక్కలపై మొరం పోసి పూడ్చారు’
<p>దిశ, మెదక్: మెదక్ జిల్లా చిలపచెడ మండలంలో రోడ్డు విస్తరిస్తున్నామని చెబుతూ హరితహారం మొక్కలపై మొరం పోసి పూడిచారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గ్రామ సర్పంచ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన మండలంలోని టోప్యతండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. గ్రామంలో రహదారి విస్తరిస్తున్నామని చెప్పి గత ప్రణాళిక పనుల్లో రహదారి పక్కన నాటిన మొక్కలపై సర్పంచ్ భర్త బిల్యానాయక్, పంచాయతీ కార్యదర్శి హనుమంతుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మొరం పోశారు. దీంతో ఏడాదిపాటు […]</p>

దిశ, మెదక్: మెదక్ జిల్లా చిలపచెడ మండలంలో రోడ్డు విస్తరిస్తున్నామని చెబుతూ హరితహారం మొక్కలపై మొరం పోసి పూడిచారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గ్రామ సర్పంచ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన మండలంలోని టోప్యతండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. గ్రామంలో రహదారి విస్తరిస్తున్నామని చెప్పి గత ప్రణాళిక పనుల్లో రహదారి పక్కన నాటిన మొక్కలపై సర్పంచ్ భర్త బిల్యానాయక్, పంచాయతీ కార్యదర్శి హనుమంతుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మొరం పోశారు. దీంతో ఏడాదిపాటు సంరక్షించిన సుమారు 200 పైగా మొక్కలు మట్టిలో కలిసిపోయాయి. అనంతరం విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి వెంటనే ఎంపీడీవో నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంపీడీఓ సర్పంచ్ అన్నిబాయికి నోటీసులు జారీచేశారు. ఈ విషయమై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు.






