భైంసా అల్లర్లపై కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ సోయం బాపురావు

by  |
amith-shah 1
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోని బైంసా పట్టణంలో ప్రతి సారి జరిగే మత ఘర్షణలపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో కలిసి సోయం బాపురావు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యలను విన్నవించారు.

భైంసాలో ప్రతిసారి హిందువుల పండుగలకు ముందు పథకం ప్రకారం మతఘర్షణలు జరగడం వెనుక రాజకీయశక్తుల ప్రమేయం ఉందని పైగా అమాయక హిందువులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపుతారని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తే నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎంపీ అన్నారు.

పొరుగు మహారాష్ట్ర నుండి మత విద్రోహ శక్తులు భైంసాలో అల్లర్లలో పాత్ర పోషిస్తున్నారని అనుమానం ఉన్నట్టు ఎంపీ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతూ హిందూ బాధితులకు న్యాయం చేయకపోగా నిందితులుగా కోర్టు చుట్టూ తిప్పుతున్నారని ఎంపీ అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టు సోయం బాపురావు తెలిపారు.

Next Story