కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌

by  |
mp-singh 1
X

దిశ, ఏపీబ్యూరో : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం నియమించింది. ఎంపీ సింగ్‌ ఇప్పటి వరకు నర్మదా తపతి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ సీఈవోగా పనిచేశారు. జూన్‌ 1న ఆయనకు అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఎంపీ సింగ్‌ సర్థార్‌ సరోవర్‌ కన్‌స్ట్రక్షన్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేసిన పరమేశం మే 31న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ కేఆర్‌ఎంబీ ఇన్‌చార్జి చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌గా పదోన్నతి పొందిన ఎంపీ సింగ్‌ను సీడబ్ల్యూఎస్‌ హెచ్‌ఏజీగా పరిగణిస్తూ జూన్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించే వరకు జీతభత్యాలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెల్లించాలని పేర్కొంది.


Next Story

Most Viewed