కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : రేవంత్‌రెడ్డి

by Shyam |

<p>దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైర‌న్ కార్యక్రమంలో భాగంగా శ‌నివారం తీవ్రంగా గాయ‌ప‌డిన కాంగ్రెస్ యువనాయ‌కులు చిలుక మ‌ధుసూద‌న్‌ రెడ్డిని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. ప్రశాంత్ నగర్‌లో మ‌ధుసూద‌న్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయ‌న యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాకు అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతోనే పోలీసులు టార్గెట్ చేసి మ‌ధుసూద‌న్‌రెడ్డి పై దాడి చేశార‌ని ఆరోపించారు. దాడికి పాల్పడిన పోలీసుల‌ను వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేద‌ని హెచ్చరించారు. ఈ ఘ‌ట‌న‌పై మాన‌వ హ‌క్కుల [&hellip;]</p>

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : రేవంత్‌రెడ్డి
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైర‌న్ కార్యక్రమంలో భాగంగా శ‌నివారం తీవ్రంగా గాయ‌ప‌డిన కాంగ్రెస్ యువనాయ‌కులు చిలుక మ‌ధుసూద‌న్‌ రెడ్డిని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. ప్రశాంత్ నగర్‌లో మ‌ధుసూద‌న్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయ‌న యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాకు అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతోనే పోలీసులు టార్గెట్ చేసి మ‌ధుసూద‌న్‌రెడ్డి పై దాడి చేశార‌ని ఆరోపించారు. దాడికి పాల్పడిన పోలీసుల‌ను వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేద‌ని హెచ్చరించారు.

ఈ ఘ‌ట‌న‌పై మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని, కార్యక‌ర్తలంద‌రూ మ‌నో ధైర్యంతో ముందుకెళ్లాల‌ని రేవంత్‌రెడ్డి సూచించారు. నిర్బంధాలు, దాడుల‌కు కాంగ్రెస్ నాయ‌కులు, కార్యక‌ర్తల‌ు స‌డ‌లిపోయే ప్రస‌క్తే లేద‌ని, ధైర్యంగా ముందుకుసాగుతార‌ని వెల్లడించారు. పార్టీ కోసం క‌ష్టపడి పనిచేసే కార్యక‌ర్తల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటామ‌ని భ‌రోసా క‌ల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మ‌ల్లు ర‌వి, వేం న‌రేంద‌ర్‌రెడ్డి, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, మ‌ల్‌రెడ్డి రాంరెడ్డి, చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు శివ‌సేనారెడ్డి, ప‌లువురు నాయ‌కులు, కార్యక‌ర్తలు పాల్గొన్నారు.

Next Story