టిమ్స్ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించరు? : రేవంత్ రెడ్డి

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో కరోనా విజృంభణను చూసి కూడా ప్రభుత్వం టిమ్స్‌ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని, వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. కొవిడ్ నివారణకు దాతలు అందించిన విరాళాలు తీసుకోవడంలో మాత్రం సీఎం కేసీఆర్‌ ముందుంటారన్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప మీరు చేసింది శూన్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో ముందు నుంచి కరోనా టెస్టులు సరిగా చేయకపోవడం [&hellip;]</p>

టిమ్స్ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించరు? : రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో కరోనా విజృంభణను చూసి కూడా ప్రభుత్వం టిమ్స్‌ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని, వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. కొవిడ్ నివారణకు దాతలు అందించిన విరాళాలు తీసుకోవడంలో మాత్రం సీఎం కేసీఆర్‌ ముందుంటారన్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప మీరు చేసింది శూన్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో ముందు నుంచి కరోనా టెస్టులు సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఓ వైపు వైద్య సిబ్బంది, నర్సులు కూడా వైరస్ బారిన పడుతుంటే కొత్త వైద్య సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణలో టీఆ‌ర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రతి కరోనా మరణానికి ప్రభుత్వాన్నే బాధ్యులుగా చేసి హత్యానేరం కింద కేసు పెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story