- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలెగాళ్ల పాలన నడుస్తోంది -రఘురామ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ప్రస్తుతం పాలెగాళ్ల పాలన నడుస్తోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఓ పాలెగాడన్నారు. తన నియోజకవర్గంలో ఇంకో పాలెగాడు ఆవ భూముల్లో అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. అమరావతి రైతులపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ నీరో చక్రవర్తిలా పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ర్టపతికి లేఖ రాసినట్లు తెలిపారు. జగతి పబ్లికేషన్స్‌లో బాలశౌరి పెట్టుబడులపై […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ప్రస్తుతం పాలెగాళ్ల పాలన నడుస్తోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఓ పాలెగాడన్నారు. తన నియోజకవర్గంలో ఇంకో పాలెగాడు ఆవ భూముల్లో అవినీతికి పాల్పడినట్లు తెలిపారు.
అమరావతి రైతులపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ నీరో చక్రవర్తిలా పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ర్టపతికి లేఖ రాసినట్లు తెలిపారు. జగతి పబ్లికేషన్స్‌లో బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Next Story






