కేంద్రమంత్రితో కీలక భేటీ.. ఫలించిన ఎంపీ కోమటిరెడ్డి కృషి

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నూతనంగా మరో మూడు జాతీయ రహదారులను తీసుకురావాలన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి ఫలించింది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కోమటిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా భువనగిరి నుంచి చిట్యాల వరకు 44 కిలోమీటర్లు, అలాగే, నల్లగొండ నుంచి మల్లెపల్లి వరకు దాదాపు 60 కిలోమీటర్లు, కొమురవెళ్లి నుంచి యాదగిరిగుట్ట మీదుగా పాటిమట్ల వరకు 100 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకకి వినతిపత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి భారత్ మాల-2లో వీటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. నూతన జాతీయ రహదారుల పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed