కొత్త వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకం: జీవీఎల్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని ఎంపీ జీవీఎల్ ​నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై సూచనలు వింటామన్నారు. కానీ వెనకడుగేసేది లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలు 30, 40 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టి ఉంటే రైతుల జీవితాలు బాగుపడేవని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాల రూపకల్పనలో మేధావులు, నిపుణులు అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురిచేస్తునట్లు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన [&hellip;]</p>

కొత్త వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకం: జీవీఎల్
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని ఎంపీ జీవీఎల్ ​నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై సూచనలు వింటామన్నారు. కానీ వెనకడుగేసేది లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలు 30, 40 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టి ఉంటే రైతుల జీవితాలు బాగుపడేవని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాల రూపకల్పనలో మేధావులు, నిపుణులు అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురిచేస్తునట్లు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డ్‌ బయట అమ్ముకోవచ్చని చెప్పారు. మార్కెట్ యార్డ్‌కు సెస్ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై అసత్యాలను నమ్మొద్దన్నారు.

Next Story