ఎంపీ సీటుకు రాజీనామా.. సిద్ధమైన బండా ప్రకాష్

by  |
ఎంపీ సీటుకు రాజీనామా.. సిద్ధమైన బండా ప్రకాష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యసభ సభ్యుడి పదవికి బండా ప్రకాశ్ నేడు రాజీనామా చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి రాజీనామా లేఖను అందజేయనున్నారు. నవంబర్ 22న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ప్రకాశ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారు. 2018 మార్చి 23న రాజ్యసభకు టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. 2018-2019 వరకు ప్రాచీన స్మారక కట్టడాలుపై రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా, 2019లో రాజ్యసభలో కార్మిక చట్టాలు, సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2019 జూన్ లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్ష ఉపనాయకుడిగా నియమితులయ్యారు.

గెజిట్ విడుదల
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా బండా ప్రకాశ్ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్ర్టోలర్ ఆఫీసర్ శశాంక్ గోయల్ బుధవారం గెజిట్ విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు ఇతర పదవిలో ఉన్నా 14 రోజుల్లోగా రాజీనామా చేయాలనే నిబంధన ఉంది. దీని ప్రకారం రాజ్యసభ సభ్యుడి పదవికి నేడు బండా రాజీనామా చేస్తున్నారు.

నేడు ప్రమాణ స్వీకారం..
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం, గుత్తా, తక్కెళ్ల పల్లి, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి నేడు ఉదయం 11 గంటల నుంచి వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకరి తరువాత ఒకరిని చైర్మన్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Next Story

Most Viewed