- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకీరా-ఆద్యలకిచ్చిన ఆస్తి వివరాలు బయటపెట్టిన పవన్ కల్యాణ్.. రేణుదేశాయ్‌కు ఇచ్చిపడేశాడుగా?
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. ఎలాగైనా విజయం సాధించాలని పవన్ ఈ సారి గట్టిగానే ప్రయత్నించారు. జనసైనికులకు కూడా ఆయన గెలుపు కోసం ఎంతో శ్రమించారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇకపోతే ఆయన ఎన్నికల వేళ ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. తన రెండో భార్య రేణుదేశాయ్ పిల్లలు అయిన అకీరా-ఆద్యల గురించి ఎదురైన ప్రశ్నలకు పవన్ స్పందించారు. ‘నా పిల్లలను అర్బన్ ఏరియాలో ఉండే సగటు ఉద్యోగి ఎలా పెంచుతాడో అలాగే పెంచాను. వారికి నేను చెప్పింది ఇదే.. స్టడీకి సంబంధించిన ఖర్చులు భరించగలను. వీలైతే సినిమాలు చేసి ప్రాపర్టీ ఇస్తానని చెప్పాను. అసలు నిజానికి మా మధ్య ఎన్నడూ ఆస్తుల గురించి చర్చ రాదు. అకీరా-ఆద్య.. నా భార్య కోసం ఒక ఇల్లు రాసి ఇచ్చాను. మనం ఏం ఎన్ని ఆస్తులు ఇచ్చామన్నది కాదు.. ఎంత నిలబెట్టుకున్నామన్నదే ముఖ్యం. మాకు కూడా మా నాన్న ఏం ఇవ్వలేదు. మా అన్న నాకు స్కిల్స్ నేర్పించారు. నా పిల్లకైతే నేను, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేందుకు ఎడ్యుకేషన్ అందించాను’ అంటూ పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గమనించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవల రేణుదేశాయ్ మనీ లేవంటూ ఓ వీడియో చేసిన విషయం తెలిసిందే. దీనికి ధీటుగా పవన్ కల్యాణ్ ఇచ్చిపడేశాడంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.