- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎవరు ఈ లేడీ డాన్ ?
దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన ఎడవెల్లి గ్రామంలో గురువారం ఉదయం గుర్తుతెలియని మూగ సైగలతో ఉన్న ఒక మహిళ గ్రామంలోని వాడవాడలా తిరుగుతూ ఇంటి ముందు ఉండి అడుక్కోకుండా, నేరుగా ఇంట్లోకి వచ్చి మూగ సైగలు చేస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లోకి వచ్చిన అ మహిళను బయటికి వెళ్ళమంటే వెళ్లకుండా ఇంట్లోనే ఉండి డబ్బులు కావాలని అడిగినట్లుగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు. ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే కంపల్సరిగా తన వద్ద ఉన్న బుక్కు పైన మొబైల్ నెంబర్ చూయిస్తూ 50 నుండి 100 రూపాయలు ఇస్తేనే బయటకు వెళ్తుందని ఎడవెల్లి గ్రామంలోని సుమారు పదిమందికి పైగా బాధితులు ఆరోపిస్తున్నారు.
కొంతమంది వద్దా డబ్బులు లేవంటే ఫోన్ పే కూడా చేయించుకుందని, కానీ ఆమె వద్ద ఎలాంటి ఫోన్ కూడా లేదని ఆరోపిస్తున్నారు. ఆమె చూపించిన ఫోన్ పే నెంబర్ 9943013029 కు ఫోన్ చేస్తే మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. చూడటానికి చదువుకున్న ఆమెలాగా, అందంగా ఉందని, చేతిలో పెన్ను పేపర్, ఒక హ్యాండ్ బ్యాగ్ ధరించి మూగ సైగలు చేస్తున్నడంతో గ్రామంలోని మహిళలందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఎవరెవరున్నారని ఆరాతిస్తుందని చిన్నపిల్లలు ఎత్తుకెళ్లడానికి వచ్చిందని గట్టిగా నమ్ముతున్నారు.
గురువారం ఉదయం గ్రామంలోని బోడ లాలయ్య, గుద్దేటి కృష్ణయ్య, లక్నమోని కృష్ణ ,లక్ష్మయ్య ,రెడ్డేమోని మల్లయ్య, దుర్గాపురం యాదయ్యలతో పాటు మరికొంతమంది ఇండ్లలోకి నేరుగా వెళ్లి 50 నుండి 100 రూపాయల వరకు ఇస్తేనే ఇంట్లో నుండి బయటకు వెళ్లినట్లు ఆరోపిస్తున్నారు.ఆ మహిళపై అనుమానం రావడంతో చివరకు గ్రామస్తులు తలకొండపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఈ విషయంపై తలకొండపల్లి ఎస్సై ని వివరణ కోరగా, ఆమె నుంచి ఇంకా పూర్తిగా సమాచారం రావడం లేదని తిరుపతి నుండి వచ్చినట్లుగా మూగ సైగలతో పేర్కొంటుందని, ఆమె మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో అడుక్కొని జీవన సాగిస్తున్నట్లు అనుమానం కలుగుతుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.