కవితనే పోటీ చేయించు.. సవాల్ విసిరిన ఎంపీ అర్వింద్

by  |
కవితనే పోటీ చేయించు.. సవాల్ విసిరిన ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తా, ఎమ్మెల్సీ కవితనే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయించుతావా.? అని ఎంపీ అర్వింద్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించి ఈ మేరకు ఎంపీ అర్వింద్ ఆదివారం ఓ ప్రకటన చేశారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ మీ కవితక్కనే పోటీ చేసేటట్లు ఒప్పించాలా అని కోరారు. నేను ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని అన్నారు. అయితే.. ఆర్మూర్ సెగ్మెంట్‌లో బీజేపీ, అధికార పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం జరుగుతోంది.

ఈ నెల 3న ఎంపీ అర్వింద్ నందిపేట్ ఎస్ఐపై చెసిన వాఖ్యలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖండించి చేసిన సవాల్‌కు ఎంపి అర్వింద్ ప్రతి సవాల్ విసిరారు.

Next Story