- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోగ్లీ ట్విట్టర్ రివ్యూ.. రోషన్ కనకాల అకౌంట్‌లో హిట్ పడ్డదా లేదా..?
స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala), కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) కాంబోలో వచ్చిన సినిమా 'మోగ్లీ'(Mowgli).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala), కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) కాంబోలో వచ్చిన సినిమా 'మోగ్లీ'(Mowgli). ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ సాక్షి(Sakshi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasd), కృతి ప్రసాద్(Kruthi Prasad) ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో రోషన్ కనకాల హిట్ సాధించాడా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం..
'కలర్ ఫోటో' లాంటి విభిన్నమైన సినిమా తీసి దర్శకుడిగా తన సత్తా చాటిన సందీప్ రాజ్ నుంచి మరో సినిమా వస్తుందంటే సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. అయితే ఆ అంచనాలను 'మౌగ్లీ' అందుకోలేకపోయిందనే చెప్పాలి. కొత్త కథ ఆశించి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ఎందుకంటే ఇది మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన కథను స్వల్ప మార్పులతో తెరకెక్కించిన సినిమా. కథ పాతదే అయినా కథనం కొత్తగా ఉంటుందా అంటే, అది కూడా అంతగా ఆకట్టుకోలేదు.
ఫస్ట్ హాఫ్ అంతా సాగదీస్తున్న భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత కథ వేగం పెరుగుతుందనిపించినా, అదే చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక హీరో రోషన్ తన తొలి సినిమా 'బబుల్ గమ్'తో పోలిస్తే నటనలో గణనీయంగా మెరుగయ్యాడు. లుక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. బండి సరోజ్ నటనలో లోపం ఏమీ లేకపోయినా, ఇలాంటి లౌడ్, నెగిటివ్ పాత్రలే వరుసగా చేస్తుండటంతో రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది.
భవిష్యత్తులో విభిన్న పాత్రలు చేయకపోతే అతనికి ఇబ్బందికరంగా మారే అవకాశముంది. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చక్కగా ఉంది. కానీ నేపథ్య సంగీతం మాత్రం కొత్తదనాన్ని అందించలేకపోయింది. ఫైనల్‌గా నిడివి విషయంలో ఇంకాస్త కత్తిరించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.






