- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ టాపిక్‌గా మారిన జీ సినీ అవార్డ్స్ 2026.. వివాదంలో కృతి సనన్ విజయం.
ముంబైలో జరిగిన ఈ వేడుకలో కృతి సనన్‌ను విజేతగా ప్రకటించగానే, సోషల్ మీడియలో విమర్శలతో హోరెత్తాయి.

దిశ, సినిమా: జీ సినీ అవార్డ్స్ 2026 వేదికగా బాలీవుడ్ నటి కృతి సనన్(Kriti Sanon) ‘ఉత్తమ నటి’ అవార్డును గెలుచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఆనంద్ ఎల్ రాయ్ (Anand L. Rai)దర్శకత్వంలో వచ్చిన ‘తేరే ఇష్క్ మే’(Tere Ishk Mein) సినిమాలో ఆమె నటనకు గాను ఈ గౌరవం దక్కింది. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా యామీ గౌతమ్ ఈ అవార్డుకు ఎక్కువ అర్హురాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో కృతి సనన్‌ను విజేతగా ప్రకటించగానే, సోషల్ మీడియలో విమర్శలతో హోరెత్తాయి. ‘హక్’ (Haq) సినిమాలో యామీ గౌతమ్ నటన అద్భుతమని, ఆమెను కాదని కృతికి అవార్డు ఇవ్వడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు రూమ్ సీన్లలో యామీ గౌతమ్ చెప్పిన మోనోలాగ్స్ కృతి కెరీర్ మొత్తంలో చేసిన నటన కంటే గొప్పగా ఉన్నాయని ఓ నెటిజన్ అనగా.. కృతితో పాటు రేసులో ఉన్న కంగనా రనౌత్ (ఎమర్జెన్సీ), త్రిప్తి డిమ్రి (ధడక్ 2) లో కృతి కంటే మెరుగ్గా నటించారని వాళ్లకు అవార్డులు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త నెట్టింట వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి మరీ వాదించుకుంటున్నారు. కాగా.. కృతి సనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ నవంబర్ 2025లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు, యామీ గౌతమ్ నటించిన 'హక్' ఒక సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా. షా బానో కేసు ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ముస్లిం మహిళల వైవాహిక హక్కుల గురించి చర్చించింది. థియేటర్లలో పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత యామీ నటనకు విపరీతమైన ప్రశంసలు దక్కాయి. మొత్తానికి, అవార్డు కృతికి దక్కినా.. ప్రేక్షకుల మనసు మాత్రం యామీ గెలుచుకుందనేది మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.






