‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ ప్రకటన చేయకుండా ఉండాల్సింది: సెల్వ రాఘవన్

by Mallepaka Hamsa |

తమిళ స్టార్ కార్తీ (Karthi)హీరోగా వచ్చిన పీరియాడికల్ డ్రామా ‘యుగానికి ఒక్కడు’(Yuganiki Okkadu).

‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ ప్రకటన చేయకుండా ఉండాల్సింది: సెల్వ రాఘవన్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ కార్తీ (Karthi)హీరోగా వచ్చిన పీరియాడికల్ డ్రామా ‘యుగానికి ఒక్కడు’(Yuganiki Okkadu). సెల్వ రాఘవన్(Selvaraghavan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2010లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరోసారి తెరపైకి రానుంది. వచ్చే ఏడాది మార్చి 14న చిత్రబృందం రీరిలీజ్ చేయనున్నారు. ఈక్రమంలో.. తాజాగా, రీరిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఇందులో పాల్గొన్న డైరెక్టర్ సెల్వ రాఘవన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘‘“యుగానికి ఒక్కడు సినిమా విడుదలైనప్పుడు చాలా నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. ఆ రివ్యూలు చూసి చాలా బాధేసింది.

అప్పటినుంచే నెగెటివిటీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ఇంతకాలం తరువాత ఇప్పుడు ‘యుగానికి ఒక్కడ’ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి. ఈ సినిమా కోసం ఎంతో డబ్బు, సమయం వేచ్చించ్చాం. రిలీజ్ టైంలో ఇలా సంబరాలు చేసుకుంటే సంతోషపడేవాడిని. అసలు ‘యుగానికి ఒక్కడు-2’ ప్రకటించకుండా ఉండాల్సింది. హీరోగా కార్తీ కాకుండా వేరెవరితో చేయడం సాధ్యం కాదు. బడ్జెట్ ఏమాత్రం సమస్య కానప్పటికీ.. ఏడాది పాటు కార్తీ కాల్‌షీట్స్ ఇస్తే కానీ సినిమా పూర్తి కాదు. ఏఐ యుగంలో ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం అంత సులభం కాదు. అలా అని ఈ సినిమాను వదిలేస్తా అని అనడం లేదు. దేనికైనా సమయం వస్తుందని వెయిట్ చేస్తున్నాను’’ అని అన్నారు.

Next Story