మీ క్షేమమే మాకు ముఖ్యం.. అభిమానులకు కీలక విజ్ఞప్తి చేసిన ‘విరోష్’

by Mallepaka Hamsa |

ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మీ క్షేమమే మాకు ముఖ్యం.. అభిమానులకు కీలక విజ్ఞప్తి చేసిన ‘విరోష్’
X

దిశ, సినిమా: ఇండియాలోనే క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్‌గా విరోష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పెళ్లి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ నెల 4న సాయంత్రం విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు ఈ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న విజయ్, రష్మిక అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

Next Story