రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ రివ్యూ

by Disha Web Desk 2 |
రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ రివ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఎన్నో అంచనాల మధ్య ఇవాళ విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే బెనిఫిట్ షోలు పడిపోయాయి. కొన్ని చోట్ల ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని చెబుతున్నారు. చిత్రంలో ప్రభాస్, పృథ్వీరాజ్ చిన్ననాటి పాత్రలు, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయని, ఏ హడావుడి లేకుండా ప్రభాస్ ఎంట్రీ సింపుల్‌గా ఉందని, కోల్‌మైన్ ఫైట్ మొత్తం సినిమాకే హైలైట్ అని, పాటలు, ఎలివేషన్స్, ప్రభాస్, పృథ్వీరాజ్ స్క్రీన్ ప్రసెన్స్ నెక్ట్స్ లెవెల్ ఉన్నాయని చెబుతున్నారు.

అంతేకాదు.. సినిమాలోని రెండు యాక్షన్‌ సీన్లు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని, ఓవరాల్‌గా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అని ఒక్క మాటలో రివ్యూ చెప్పేస్తున్నారు. దీంతో చాలా కాలం తర్వాత ప్రభాస్ ఖాతాలో హిట్ పడ్డట్టయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ సినిమా ఒక్కటి కూడా పడలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆకలిని మంచి బిర్యానీతో మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీర్చాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతీ హాసన్, కీలక పాత్రలో జగపతి బాబు మెప్పించారని చెబుతున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి.


Next Story

Most Viewed