- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ హీరోయిన్లే మాకు పాఠాలు నేర్పిస్తున్నారు: ఖుష్బూ
మనం మన చుట్టూ నిర్మించుకున్న హద్దులను, గోడలను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన ప్రతిభ ప్రపంచం నలుమూలలా గుర్తింపు పొందుతుంది.

దిశ, సినిమా: సీనియర్ నటి ఖుష్బూ సుందర్ నేటి తరం యంగ్ హీరోయిన్లపై కురిపించిన ప్రశంసలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా యంగ్ హీరోయిన్లు చూపిస్తున్న ప్రతిభ, వారి ప్లానింగ్ చూసి తాను ఆశ్చర్యపోతున్నానని ఆమె వెల్లడించారు. ఈ రోజుల్లో వస్తున్న నటీమణులు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారని ఖుష్బూ కొనియాడారు. "సెట్స్‌కి రాకముందే వారు తమ హోంవర్క్ అంతా పూర్తి చేసుకుని వస్తున్నారు. మేకప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు, తమను తాము స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేసుకోవాలో వారికి బాగా తెలుసు. నిజం చెప్పాలంటే, సీనియర్లమైన మాకే వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
వారికి సలహాలు ఇచ్చే స్థాయిని దాటి, వారే మాకు పాఠాలు నేర్పించేలా ఎదుగుతున్నారు" అని ఖుష్బూ ప్రశంసించారు. భారతీయ నటీమణులు ప్రపంచస్థాయి వేదికలపై మెరవడం పట్ల ఖుష్బూ హర్షం వ్యక్తం చేశారు. ప్రియాంక చోప్రా ఆస్కార్స్ వేదికపై ప్రజెంటర్‌గా కనిపించడం, ఆలియా భట్ బాఫ్టావేడుకల్లో సందడి చేయడం మన ఇండస్ట్రీకి గర్వకారణమని ఆమె అన్నారు. "మనం మన చుట్టూ నిర్మించుకున్న హద్దులను, గోడలను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన ప్రతిభ ప్రపంచం నలుమూలలా గుర్తింపు పొందుతుంది" అని ఆమె స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. అయితే సీనియర్ నటి అయి ఉండి కూడా కొత్త వారిని ప్రోత్సహిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






