- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ మూవీలో యంగ్ హీరోయిన్ .. ప్రతి చిరునవ్వులో ఒక రహస్యం దాగి ఉంటుందంటూ మేకర్స్ పోస్ట్
మలయాళ బ్యూటీ రజిషా విజయన్(Rajisha Vijayan) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ రజిషా విజయన్(Rajisha Vijayan) తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమ్ తెచ్చుకుని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ దక్కించుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించిన రజిషా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఇటీవల బైసన్, పరదా వంటి చిత్రాలతో వచ్చిన ఈ భామ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించిలేకపోయాయి.
అయినప్పటికీ రజిషాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. తాజాగా, స్టార్ హీరో సినిమాలో రజిషా చాన్స్ దక్కించుకున్నట్లు తెలుపుతూ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కలంకావల్’(Kalamkaval). ఇందులో రజిషా కీలక పాత్రలో కనిపించనుంది. జితిక్ కె జోస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌లో వినాయకన్, గిబిన్, గోపీనాథ్, మీరా జాస్మిన్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా మమ్ముట్టి ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు మూవీ మేకర్స్ ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇక రజిషా నటిస్తున్నట్లు వెల్లడిస్తూ..ప్రతి చిరునవ్వులో ఒక రహస్యం దాగి ఉంటుంది అనే క్యాప్షన్ జత చేస్తూ అద్దంలో చూసుకుంటున్న హీరోయిన్ పోస్టర్‌ను విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా హిట్ అందుకోలేని ఈ అమ్మడు ‘కలంకావల్’పై ఆశలన్నీ పెట్టుకుంది. ఈ మూవీ ఎలాగైనా హిట్ కావాలని తాపత్రయపడుతోంది.






