సిద్దు జొన్నలగడ్డ సినిమాలో యంగ్ హీరోయిన్ కీ రోల్.. లక్కీ చాన్స్ కొట్టేసిందిగా!

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ నివాశిని (Nivaashiyni Krishnan)మోడల్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

సిద్దు జొన్నలగడ్డ సినిమాలో యంగ్ హీరోయిన్ కీ రోల్.. లక్కీ చాన్స్ కొట్టేసిందిగా!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నివాశిని (Nivaashiyni Krishnan)మోడల్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే పలు గోల్డ్ యాడ్స్ చేసిన ఈ భామ నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. తమిళ చిత్రం ‘ఓహో ఎంతన్ బేబీ’ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. కృష్ణ కుమార్(Krishna Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రుద్ర, మిథిలా(Mithila) జంటగా నటించారు. విశాల్ స్టూడియోస్, రోమియో పిక్చర్స్ బ్యానర్స్‌పై విష్ణు విశాల్, రాహుల్ నిర్మించారు. ఇక ఈ మూవీ జూలై 11 థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఇందులో నటించిన నివాశిని నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. దీంతో అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం నివాశిని సైకలాజికల్ థ్రిల్లర్ ‘బూమ‌రాంగ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 30న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, నివాశిని ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’(Telusu Kada) సినిమాలో ఈ అమ్మడు కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు లక్కీ ఛాన్స్ కొట్టేసిందని నివాశినికి కంగ్రాట్స్ చెబుతున్నారు. నీరజ్ కోన దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై T. G. విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. అక్టోబర్ 17న విడుదల కాబోతుంది.

link

Next Story