‘ఫంకీ’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్.. చిత్ర మా ప్రపంచానికి మరింత మెరుపు జోడిస్తుందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవల ‘లైలా’ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు.

‘ఫంకీ’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్.. చిత్ర మా ప్రపంచానికి మరింత మెరుపు జోడిస్తుందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవల ‘లైలా’ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఈ సారి డిఫరెంట్‌గా అమ్మాయి పాత్రలో నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ (Funky)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కామేడీ ఎంటర్‌టైనింగ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుదీప్(Anudeep) డైరెక్షన్‌లో రాబోతుంది. ‘ఫంకీ’ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అక్టోబర్ 10న విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో.. విశ్వక్ సేన్ సరసన నటించబోతున్న హీరోయిన్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో కోలీవుడ్ యంగ్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) నటిస్తున్నట్లు పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ‘చిత్ర’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ‘‘మా చిత్ర ఫంకీ ప్రపంచానికి మరింత మెరుపులు జోడిస్తుంది. బ్యూటిఫుల్ కయాదు లోహర్‌కు వెల్ కమ్’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక కయాదు, విశ్వక్ కెమెస్ట్రీ చూసేందుకు సినీ ప్రియులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

link

Next Story