- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raj Tarun: రాజ్‌తరుణ్ సినిమాలో మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్న యంగ్ హీరో.. అంచనాలను పెంచేస్తున్న డైరెక్టర్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. విజయ్ మిల్టన్(Vijay Milton) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన భారీ అంచనాలను క్రియేట్ చేసింది. నటుడు ఆరి తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండగా, రాజ్ తరుణ్ తమిళంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే, సంగీత దర్శకుడు పాల్ డబ్బా నటుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పుడు భరత్ చేరికతో ఈ కాంబినేషన్ మరింత బలపడింది.
కాదల్, పట్టియల్, కాలిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో ఎమోషనల్ అండ్ ఎనర్జీ నండిన పాత్రను పోషిస్తున్నాడు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుంది. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్ ఇండియన్ రేంజ్ వచ్చినట్లు అయింది. దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. “భరత్ ఎంతో నిబద్దత గల నటుడు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో ఇంపార్టెంట్ పాత్ర. కథను మలుపు తిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కూడా ఎంతో ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది.






