SPY Trailer : ఆకట్టుకుంటున్న ‘స్పై’ ట్రైలర్.. రానా ఎంట్రీతో గూస్‌బంప్స్ పక్కా (వీడియో)

by Disha Web Desk 2 |
SPY Trailer : ఆకట్టుకుంటున్న ‘స్పై’ ట్రైలర్.. రానా ఎంట్రీతో గూస్‌బంప్స్ పక్కా (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన స్పై మూవీ ట్రైలర్‌ను మేకర్స్ గురువారం సాయంత్రం(జూన్ 22) విడుదల చేశారు. సుభాష్ చంద్రబోస్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ ట్రైలర్‌ను వీక్షించిన ఫ్యాన్స్‌ సినిమా కోసం ఆగలేకపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్ చివరి నిమిషంలో భళ్లాల దేవుడైన రానా ఎంట్రీ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిచ్చింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 29న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇప్పటికే కార్తికేయ, కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్.. ఈ స్పై మూవీతో మరో హిట్ కొట్టేందుకు రెడీ అయినట్లు తలుస్తోంది.

Next Story

Most Viewed