బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ.. ‘సూర్య-46’ సినిమాలో కీ రోల్..

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఆర్ జె బాలాజీ తెరకెక్కిస్తున్న ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ.. ‘సూర్య-46’ సినిమాలో కీ రోల్..
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఆర్ జె బాలాజీ తెరకెక్కిస్తున్న ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే తెలుగులో సూర్య ఓ మూవీ చేయనున్నారు. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యంగ్ బ్యూటీ మమిత బైజు(Mamita Baiju) సూర్య సరసన నటిస్తోంది. ‘సూర్య-46’ వర్కింట్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సూర్య గజిని లోని సంజయ్ రామస్వామి వంటి పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల డైరెక్టర్ వెల్లడించారు.

అయితే ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘సూర్య-46’ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ యంగ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో భవాని శ్రీ(bhavanisre) ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు టాక్. ఆమెను చిత్రబృందం సంప్రదించగా.. నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆమె ‘సూర్య-46’లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇక ఈ అమ్మడు ఇటీవల ‘విడుదలై-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య చిత్రంలో చాన్స్ అందుకోవడంతో అమ్మడు దశ మారనుందని అంతా భావిస్తున్నారు.

Next Story