యాక్షన్ థ్రిల్లర్ ‘టెహ్రాన్’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా యంగ్ బ్యూటీ.. పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం(John Abraham) గత కొన్నేళ్లుగా ‘టెహ్రాన్’(Tehran) సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ ‘టెహ్రాన్’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా యంగ్ బ్యూటీ.. పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం(John Abraham) గత కొన్నేళ్లుగా ‘టెహ్రాన్’(Tehran) సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం విడుదల నోచుకోలేదు. అరుణ్ గోపాల్(Arun Gopal) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోంది. మాడాక్ ఫిల్మ్స్, బేక్ మై ఫిల్మ్స్ బ్యానర్స్‌పై సందీప్ లేజెల్, శోభన్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. ఇందులో మధురిమ తులి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ‘టెహ్రాన్’ సినిమా 2023లోనే ప్రారంభమైనప్పటికీ పలు సార్లు వాయిదా పడింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని డైరెక్టర్ ఓటీటీలో విడుదల చేయనున్నారు.

‘టెహ్రాన్’ చిత్రానికి సంబంధించిన హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ మూవీలోని హీరోయిన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మానుషి చిల్లర్ జాన్ అబ్రహం సరసన నటించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె ఎస్‌ఐ దివ్య రానా పాత్రలో కనిపించనుండగా.. చేతిలో గన్ పట్టుకుని ఎవరికో గురి పెట్టినట్లుగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపించింది. ఈ పోస్ట్‌కు ‘‘ధైర్యం, దృఢ సంకల్పం, నిబద్ధత - ఎస్.ఐ. దివ్య దేశానికి సేవ చేయడానికి అవసరమైనవన్నీ కలిగి ఉంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.

link

Next Story