- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ బ్యూటీ.. నమ్మకంతో మా ప్రయాణం ప్రారంభించామని పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
యంగ్ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియ(Sri Gauri Priya) ‘మెయిల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియ(Sri Gauri Priya) ‘మెయిల్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ‘మ్యాడ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో అనతి కాలంలోనే గౌరీప్రియ స్పెషల్ క్రేజ్‌ను దక్కించుకుని వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, శ్రీ గౌరీ ప్రియ గుడ్ న్యూస్ ప్రకటించింది. మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సరసన శ్రీ గౌరీ ప్రియ రొమాన్స్ చేయనుంది.
‘ప్రొడక్షన్-1’ పేరుతో రాబోతున్న ఈ సినిమాకు మరియా ఎలాంచెజియన్(Maria Elanchezian) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జయవర్ధన్ నిర్మిస్తుండగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అబ్బాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘‘ప్రతి ఫ్రేమ్ విశ్వాసంతో ప్రారంభమవుతుంది. హృదయాలను సమలేఖనం చేయడంతో పాటు నక్షత్రాలను ఏకం చేస్తోంది. నమ్మకంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాము’’ అని రాసుకొచ్చింది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






