- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరలో ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరలో ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు నేడు హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న పవన్ కళ్యాన్ బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గడియారం ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతా దీని గురించి సెర్చ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ వాచ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ Eberhard కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర దూ. 1, 85, 148 అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ‘హరి హరి వీరమల్లు’ ఈ నెల 24న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్(Nidhi Agarwal) జంటగా నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుండగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాబీ డియోల్, అనూసూయ, పూజా పొన్నాడ, అనుపమ్ ఖేర్(Anupam Kher), అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదాల తర్వాత చివరికి ఈ నెల చివర్లో విడుదల కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ అభిమానులు మాత్రం అసలు రిలీజ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అని అయోమయంలో పడిపోయారు.






