‘తప్పుడు ప్రచారం చేస్తే గట్టి ధర చెల్లించాలి’.. డ్రగ్ రాకెట్ కేసుపై స్పందించిన నోరా ఫతేహి (పోస్ట్)

by Mallepaka Hamsa |

రూ. 252డ్రగ్ రాకెట్‌తో బాలీవుడ్ నటీనటులకు సంబంధం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

‘తప్పుడు ప్రచారం చేస్తే గట్టి ధర చెల్లించాలి’.. డ్రగ్ రాకెట్ కేసుపై స్పందించిన నోరా ఫతేహి (పోస్ట్)
X

దిశ, సినిమా: రూ. 252డ్రగ్ రాకెట్‌తో బాలీవుడ్ నటీనటులకు సంబంధం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌(Shraddha Kapoor)తో పాటు ఆమె సోదరుడు సిద్ధాంత్ కపూర్, నోరా ఫతేహి(Nora Fatehi), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయేన్సర్ ఓర్రీ, అబ్బాస్-ముస్తాన్, ర్యాపర్ వరుణ్ మఠుర్, వంటి హై ప్రొఫైల్ ఈవెంట్లకు హాజరయ్యారని తెలుస్తోంది. అయితే అండర్ వరల్డ్ ఫిగర్ దావూద్ ఇబ్రహీం సిండికేట్‌కు కూడా దీనితో లింక్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫారిన్ కంట్రీస్ నుంచి లగ్జరీ, డ్రగ్ ఫ్యూల్డ్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఇందుకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా, ఈ కేసులో తన పేరు ఉండటంపై నోరా ఫతేహి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చింది. నేను పార్టీలకు వెళ్లను నా పనిలోనే బిజీగా ఉంటాను. నాకు వ్యక్తిగత జీవితం కూడా లేదు. అలాంటి వారితో నేను ఎప్పుడూ మింగిల్ అవ్వలేదు అవ్వను కూడా. దుబాయ్‌కి వెళితే నా హైస్కూల్ ఫ్రెండ్స్‌తో గడుపుతాను. కావాలనే నా పేరుని ఇందులోకి లాగుతున్నారు. కానీ ఈసారి అలా జరగనివ్వను. నాపై తప్పుడు ఆలోచనలు చేస్తే భారీ ధర చెల్లించాల్సి వస్తుంది” అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది. అయితే నోరా గతంలో కూడా ఇటువంటి ఫేక్ న్యూస్‌తో తనను దెబ్బతీయడానికి ప్రయత్నించారని, కానీ అవి ఫలించలేదని చెప్పారు. తనకు సంబంధం లేని పార్టీలకు, కార్యకలాపాలకు తన పేరు వాడొద్దు అని కఠినంగా హెచ్చరించింది.

Next Story