బోల్డ్ సీన్స్ చేస్తున్నప్పుడు చెమటలు పట్టాల్సిందే.. అయినా ఆపరంటూ క్రేజీ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎవరు ట్రెండ్ అవుతారో ఎవరూ ఊహించలేరు.

బోల్డ్ సీన్స్ చేస్తున్నప్పుడు చెమటలు పట్టాల్సిందే.. అయినా ఆపరంటూ క్రేజీ బ్యూటీ  షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎవరు ట్రెండ్ అవుతారో ఎవరూ ఊహించలేరు. కొంతమంది సినీ తారలు అనుకోని విధంగా అతి తక్కువ సమయంలోనే వారికే తెలియకుండా ఫేమస్ అయిపోతుంటారు. అలా అయిన వారిలో మఠారీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్(Girija Oak) కూడా ఒకరు. ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారి ట్రెండ్ సెట్ చేస్తోంది. గత రెండు వారాలుగా ఎక్కడ చూసిన ఆమె ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూల్లో చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియా సంచలనంగా మారింది. నిత్యం పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, గిరిజ కిస్ సీన్లు చిత్రీకరించడంపై షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తెలియని వ్యక్తితో రొమాన్స్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతారు? ముఖ్యంగా కిస్సింగ్ షాట్లు ఎలా షూట్ చేస్తారు? అని యాంకర్ అడగ్గా.. ‘‘నన్ను చాలామంది ఇదే ప్రశ్న అడిగారు. షూటింగ్ సమయంలో మొత్తం పక్రియ అంతా మెకానికల్‌గా ఉంటుంది. నిజమైన భావాలను అక్కడ ఏమాత్రం చూపించకూడదు. షూట్ సమయంలో సౌండ్‌కి ఇబ్బంది కాకూడదని ఏసీలను ఆఫ్ చేసి చేస్తారు. దీంతో ఆ సీన్స్ చేస్తున్నప్పుడు చెమటలు కారుతూనే ఉంటాయి. అయినా ఇంటిమేట్ సీన్స్ చేయడం ఆపకూడదు. అప్పుడు ఎవరో ఒకరు హెయిర్‌డ్రయర్ పెట్టి చెమట తుడుస్తుంటారు.

హెయిర్ స్టైలిస్ట్ వచ్చి హెయిర్ సెట్ చేస్తారు. మరోవైపు లైట్ బాగా పడటం లేదని థర్మాకోల్ తీసుకొచ్చి పెడతారు. ఇలా అందరూ చూస్తున్నప్పుడు రొమాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే ఆ సీన్స్ మెకానికల్‌గా చేస్తాం. ఒక్కోసారి నటుడికి కాకుండా కార్డ్‌బోర్డ్‌ను ముద్దు పెట్టినట్టే అనిపిస్తుంది. ఏ మాత్రం ఎమోషన్ ఉండదు. క్లోజప్ తీసేటప్పుడు కూడా ఫీల్ అయ్యే చాన్స్ ఉండదు. థర్మాకోల్ లేదా బ్లాక్ క్లాత్ చూసుకుంటూ రొమాంటిక్ డైలాగులు చెప్పమంటారు. అలా నేను చాలాసార్లు చేశాను’’ అని తెర వెనక జరిగే సీక్రెట్‌ను బయటపెట్టింది.

Next Story