'ఎల్లమ్మ' షూటింగ్ ఆల‌స్యం..త‌ల ప‌ట్టుకుంటోన్న వేణు ?

by velandi.Saikiran |   (  Updated:2026-05-07 21:30:49  IST  )

హీరోయిన్ సెల‌క్ష‌న్ కార‌ణంగా 'ఎల్లమ్మ' షూటింగ్ ఆల‌స్యం అవుతోంది.

ఎల్లమ్మ షూటింగ్ ఆల‌స్యం..త‌ల ప‌ట్టుకుంటోన్న వేణు ?
X

దిశ‌, వెబ్ డెస్క్: బలగం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు వేణు, ఇప్పుడు మరో మాస్ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నాడు. ఎల్లమ్మ అనే ఊర మాస్ టైటిల్ తో వస్తున్నాడు వేణు. ఈ సినిమాలో ఇప్పటికే హీరోగా దేవి శ్రీ ప్రసాద్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ అతనికి జోడిగా హీరోయిన్ ను మాత్రం చిత్ర బృందం ప్రకటించలేదు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ను దింపాలని మేకర్స్ పట్టుబడుతున్నారట.

ఇందులో భాగంగానే కీర్తి సురేష్, సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ లాంటి హీరోయిన్ల పేర్లను కూడా ఇప్పటికే పరిశీలించారట. కానీ వీళ్లలో ఎవరిని కూడా చిత్ర బంధం ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. ఎవరిని తీసుకుంటే సినిమా బంపర్ హిట్ అవుతుందనే దానిపైన వేణు చాలా కసరత్తులు చేస్తున్నాడట. అటు దిల్ రాజు కూడా హీరోయిన్ సెలక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ సెలక్షన్ పూర్తికాగానే షూటింగ్ షరావేగంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Next Story