War 2: జూనియర్ ఎన్టీఆర్ కోసం రంగంలోకి వైసీపీ?

by velandi.Saikiran |

కూటమి "కూలీ" వైపు ఉందని.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం వైసీపీ రంగంలోకి దిగబోతోందని కొత్త చర్చ మొదలైంది.

War 2: జూనియర్ ఎన్టీఆర్ కోసం రంగంలోకి వైసీపీ?
X

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ ( NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇద్దరు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2 ( War 2). ఈ సినిమాలో.. హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మరో మూడు రోజుల్లోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే ఆదివారం..వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర బృందం. దీంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది.

దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ హైలెట్ అయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం.. తనకు తిరుగులేదని జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ నటించిన కూలీ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. వార్ 2 కంటే కూలీ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందని సోషల్ మీడియాలో మొన్నటి నుంచి ఓ చర్చ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో... రంగంలోకి వైసీపీ దిగినట్లు తెలుస్తోంది. తాజాగా.. రజినీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలై సక్సెస్ కావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు.

అయితే.. కూటమి "కూలీ" వైపు ఉందని.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం వైసీపీ రంగంలోకి దిగబోతోందని కొత్త చర్చ మొదలైంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్న నేపథ్యంలో... ఆ రోజున కూలీ సినిమాకు వ్యతిరేకంగా... ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని.. ఇప్పటికే వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి ఎన్టీఆర్ కు అనుకూలంగానే వైసీపీ పార్టీ కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వార్ 2 నేపథ్యంలో ఎన్టీఆర్ కు అనుకూలంగా పోస్టులు పెట్టాలని ఆదేశాలు కూడా వెళ్లాయట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story