యశ్ తల్లి వివాదాస్పద కామెంట్స్.. గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో యశ్‌(yash)తో పాటు ఆయన తల్లి పుష్ప (pushpa) నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

యశ్ తల్లి వివాదాస్పద కామెంట్స్.. గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యశ్‌(yash)తో పాటు ఆయన తల్లి పుష్ప (pushpa) నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ‘కొత్తలవాడి’ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ఆగస్టు 1న రిలీజ్ కాగా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక పుష్ప ఈ మూవీ సమయంలో ఓ నటిపై చేసిన కామెంట్లు మాత్రం వివాదానికి దారితీశాయి. ప్రముఖ హీరోయిన్ దీపికా దాస్‌ను తన నెక్ట్ సినిమాతో ఎంపిక చేసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆమె స్టార్ హీరోయిన్ కాదు.. అసలు దీపికా ఏం సాధించిందని తీసుకోవాలని అనేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా దాస్(Deepika Das) ఇన్ని రోజులకు తనపై పుష్ప చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చింది.

‘‘సినీ ఇండస్ట్రీలో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునేందుకు నేను ఎవరి పేరు వాడుకోలేదు. అవతల ఉన్నద అమ్మ అయినా పుష్పమ్మ అయినా నా గురించి చెడుగా మాట్లాడే హక్కు లేదు. ఏదో వారిపట్ల గౌరవంతో సైలెంట్‌గా ఉన్నాను. నేను పెద్దగా ఏదీ సాధించలేకపోవచ్చు. కానీ నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారా?. ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసే ముందుకు వారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి’’ అని చెప్పుకొచ్చింది.దీపికా దాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే దీపికా, పుష్ప బంధువులు కాగా.. మనస్పర్థలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కామెంట్స్‌తో వీరి మధ్య మరింత దూరం ఏర్పనుంది. వీరిద్దరి కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.

Next Story