వివాదంలో ‘హక్’ మూవీ.. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు.. అందరూ చూడొచ్చంటూ యామి గౌతమ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-31 09:00:45  IST  )

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi), యామీ గౌతమ్(Yami Gautam) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హక్’.

వివాదంలో ‘హక్’ మూవీ.. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు.. అందరూ చూడొచ్చంటూ యామి గౌతమ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi), యామీ గౌతమ్(Yami Gautam) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హక్’. జంగ్లీ పిక్చర్స్, ఇన్‌సోమ్నియా ఫిల్మ్స్, బావేజా స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. షీబా చద్దా, వర్తికా సింగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. ‘హక్’లో ఇస్లాం విడాకుల పద్ధతిని ప్రశ్నిస్తూ సాగే ఓ సీన్‌పై వివాదం మొదలైంది. ఓ వర్గం పలు విమర్శలు చేయడంతో పాటు సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో విడుదల కాకముందే బ్యాన్ అయిందంటూ పలు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యామీ గౌతమ్ ఈ విషయంపై స్పందించింది.

‘‘మా సినిమాకు యూఏఈలో సెన్సార్‌పరంగా ఎటువంటి కట్స్ లేకుండా 15ప్లస్ సర్టిఫికెట్ లభించింది. అక్కడ ఎలాంటి సమస్య లేదంటూ ఈ మూవీ ఏ మతాన్నీ విమర్శించడానికి తీయలేదని అర్థం. కాబట్టి ‘హక్’ అందరూ చూడదగిన సినిమా. సినిమా విడుదల కాకుండా దీనికి మించి సాక్ష్యం ఇవ్వడం కష్టమే. మేము ఒక్క వర్గానికి మాత్రమే సంబంధించి సినిమా తీయడం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేశాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రం ‘బానో: భారత్ కీ భేటీ’ పుస్తకంలోని అంశాల ఆధారంగా తెరకెక్కిన ట్లు సమాచారం. మహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం చారిత్రక కేసుకు సంబంధించిన సంఘటనలను కూడా ఇందులో చూపించబోతున్నారు. దీంతో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు మూవీ టీమ్.

Next Story