- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా?..అతన్ని ఉద్దేశించి మారుతి సెన్సేషనల్ కామెంట్స్
అంకిత్ కొయ్య(Ankit Koyya), నీలఖి హీరోహీరోయిన్లుగా కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’.

దిశ, సినిమా: అంకిత్ కొయ్య(Ankit Koyya), నీలఖి హీరోహీరోయిన్లుగా కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’. వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, మారుతి టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో గెస్ట్‌గా పాల్గొన్న మారుతి (Maruti)సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘ఎవరైనా బాధలో ఉంటే మాత్రం అతడిని కలుస్తాను. మంచి సినిమా ‘ త్రిబాణదారి బార్బరిక్’ చేశారు. ఆ టైటిల్ ఎవరికి అర్ధం కాదని చెప్పినా వినలేదు. ఆయన ఒక ట్రాన్స్‌లో ఉన్నాడు. దేవుడని ఫీల్ అయ్యాడు. ఆయన నమ్మాడని నేను కూడా ఫోర్స్ చేయలేను.అయితే ఈ సినిమా ప్రేక్షకులు చూడలేదని చెప్పుతో కొట్టుకన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది.
దయచేసి కళాకారులను తయారు చేసే వాళ్ళు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ప్రేక్షకులని రప్పించడానికి పిచ్చోళ్లలా మాట్లాడుతున్నారు.. సినిమాలు మానేస్తా అంటున్నారు... బూతులు మాట్లాడుతున్నారు... ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా?ఈ సినిమా ఆడకపోతే ఇంకో మూవీ ఆడుతుంది. నేను రాసినన్ని మీనింగ్ డైలాగ్స్ ఎవడు రాయలేడు. కానీ ఎందుకు రాయట్లేదు కుటుంబాలు రావాలి. మనం మంచి సినిమా క్వాలిటీతో ఇవ్వాలి. బూతు డైరెక్టర్ అనేవాడు రూ.400 కోట్లతో ‘ది రాజాసాబ్’ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి. వాడి కెరీర్ చూడండి.. ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. ఒక ఫ్లాప్ తర్వాత పాన్ ఇండియా హీరో పిలిచి మరీ ఊరికే సినిమా ఆఫర్ ఇవ్వడు. ప్రభాస్ మనసులో నేనున్నా. మేము ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.






