- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిల్మ్ ఫేర్‌లో కాజల్ వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?
కాజల్ వేసుకున్న గ్రీన్ కలర్ మెరుపుల డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన జోరు తగ్గలేదని నిరూపిస్తున్నారు. పెళ్లి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన ఫిట్‌నెస్‌తో, అందంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ భామ, తాజాగా జరిగిన 2026 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె రాకతో రెడ్ కార్పెట్ ఒక్కసారిగా మెరిసిపోయింది. ఈ వేడుక కోసం కాజల్ వేసుకున్న గ్రీన్ కలర్ మెరుపుల డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ డ్రెస్సులో కాజల్ ఒక దేవకన్యలా మెరిసిపోతూ కెమెరా కళ్లను తనవైపు తిప్పుకున్నారు.
అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఆ డ్రెస్ ఖరీదు. తాజా.. సమాచారం ప్రకారం, కాజల్ ధరించిన ఈ అవుట్‌ఫిట్ ధర దాదాపు 1.5 లక్షల రూపాయలు ఉంటుందట. కేవలం ఒక ఈవెంట్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం చూసి నెటిజన్లు చందమామ రేంజే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్, 'భగవంత్ కేసరి', 'ఇండియన్ 2' వంటి భారీ చిత్రాలతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. గ్లామర్ ఫీల్డ్‌లో వయసుతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కాజల్, ఈ లక్షన్నర డ్రెస్సుతో మరోసారి తన రిచ్ టేస్ట్‌ను చాటుకున్నారు.






