డబ్బు కోసం అలాంటి పని అస్సలు చేయను: Kiara Advani

by Disha Web Desk 9 |
డబ్బు కోసం అలాంటి పని అస్సలు చేయను: Kiara Advani
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘కథ నచ్చినట్లయితే ఎలాంటి పాత్రలో నటించడానికైనా నేను రెడీ. ఆ స్టోరీకి కనెక్టైతే గ్లామర్ షోకు కూడా సిద్ధమే. నన్ను అంతగా ఆకట్టుకోకపోతే, నాకు నచ్చకపోతే మాత్రం అస్సలు చేయను. ఎంత పారితోషికం ఇచ్చిన కూడా కథ నచ్చకపోతే అంతే. ఏదైనా కూడా నా మనసు యాక్సెప్ట్ చేస్తేనే చేస్తాను. డబ్బు కోసం నాకు నచ్చని పని ఏది చేయను. అంటూ కియారా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరోసారి రామ్ చరణ్‌ సరసన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చెంజర్’ లో నటిస్తుంది. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే బాలీవుడ్‌లోనూ మరిన్ని సినిమా షూటింగ్స్‌లో బిజీగా గడిపేస్తోంది.

ఇవి కూడా చదవండి: అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరుమీదున్న 'జవాన్'



Next Story

Most Viewed