- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతను లేకుంటే నేను అస్సలు సినిమాలు చేయను.. సంచలన ప్రకటనతో బిగ్ షాకిచ్చిన లోకేష్ కనగరాజ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. ఆయన ఎంతో మంది స్టార్ హీరోలతో చిత్రాలు చేశారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. ఆయన ఎంతో మంది స్టార్ హీరోలతో చిత్రాలు చేశారు. ఇటీవల ఆయన సూపర్ రజినీకాంత్(Rajinikanth)తో ‘కూలీ’ సినిమాతో పలకరించారు. ఇందులో నాగార్జున విలన్‌గా చేయగా.. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. దీంతో గత కొద్ది రోజుల నుంచి లోకేష్ కనగరాజ్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. ఆయన స్థాయిలో తెరకెక్కించలేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఏ సినిమా అయినా రూ. 100 కోట్లు వస్తేనే సక్సెస్ అయినట్లు కాదు. దర్శకులంతా అలాంటి చిత్రాలంటే కుదరదు. కొన్ని అంతకు మించిన విలువను పెంచుతాయి. నేను మూవీస్ తీసుకున్నప్పుడు నా దగ్గర ఏమీ లేవు. నేను రూ. 4వేలతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. కెమెరా ఎవరి దగ్గరైతే ఉందో వాడే ఎడిటర్. కాబట్టి ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు బడ్జెట్ అవసరం లేదు. ఎవరైనా దర్శకుడి దగ్గర పనిచేయాలనుకున్నా. అది కూడా జరగకుండానే డైరెక్ట్ అయ్యాను. నా సినిమాలకు ఎవరిని తీసుకోవాలో నా ఇష్టపూర్వకంగా తీసుకుంటా.
నా మూవీస్‌కి అనిరుధ్ ఓ ప్లస్ పాయింట్. అతను లేకుంటే నేను సినిమాలు చేయను. ఒకవేళ అనిరుధ్ రిటైర్ అయితే అప్పుడు ఏఐ మీద ఆధారపడుతానేమో గానీ వేరే వాళ్లతో చేయను. కాకపోతే దానికి ఇంకా టైమ్ ఉంది. ప్రేక్షకుల అంచనాలను నేను విమర్శించలేను. ఎప్పుడూ వారి అంచనాల కోసం కథలు రాయను. అంచనాలను అందుకుంటే బాగుంటుంది. కాకపోతే ప్రయత్నిస్తాను.’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి.






