రెండు వందలు ఎక్కువ తీసుకొని ‘జవాన్’ రిలీజ్ చేయండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

by Disha Web Desk 9 |
రెండు వందలు ఎక్కువ తీసుకొని ‘జవాన్’ రిలీజ్ చేయండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్‌’. అట్లీ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె కూడా నటిస్తున్నారు. ఇక అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది.

అయితే జూన్ 2న విడుదలకావాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు షారూక్. ‘అన్నా.. కావాలంటే 100, 200 రూపాయలు ఎక్కువ తీసుకో. కానీ ‘జవాన్’ సినిమా త్వరగా విడుదల చేయండి’ అని ఓ అభిమాని కోరాడు. దీనికి స్పందించిన షారుక్ ‘ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇంత తక్కువకు లేదు. నీకు మొత్తం పిక్చర్ కావాలా?’ అంటూ ఫన్నీ‌గా బదులిచ్చాడు.

Next Story

Most Viewed