- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైటిల్ గెలవడంతో నా జీవితమే మారిపోయింది.. ఐశ్వర్య రాయ్ ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai)మోడల్‌గా వచ్చి మిస్ వరల్డ్ కీరిటాన్ని సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai)మోడల్‌గా వచ్చి మిస్ వరల్డ్ కీరిటాన్ని సొంతం చేసుకుంది. 1994లో అనుకోకుండా పాల్గొని ఏకంగా విన్నర్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కానీ ‘పొన్నియన్ సెల్వన్-2’(Ponniyin Selvan-2)సక్సెస్ తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరం అయింది. తాజాగా, రెడ్ సి ఫెస్టివల్‌లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 1994లో మిస్ వరల్డ్ పోటీలను అందాల పోటీలా భావించలేదు, అలాగే టైటిల్ కూడా నాకే రావాలని అనుకోలేదు. అంతర్జాతీయ పోటీలో భారత్‌కు ప్రాతినిద్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావించి పాల్గొన్నా అని చెప్పింది. ఆ సమయంలో భారతీయుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని.. ఆ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచిందని తెలిపింది.
అందుకే ఆ వేదికపై మన దేశం గొప్పతనాన్ని చెప్పాల్సి వచ్చిందని.. టైటిల్ గెలవడంతో తన జీవితమే మారిపోయిందని పేర్చొన్నారు. అలాగే తన ఇండస్ట్రీలో తొలినాళ్ల అనుభావాలు గుర్తు చేసుకుంది. మణిరత్నం దర్శకత్వంలో మొదటి సినిమా చేశాను. అదే సంవత్సరం బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. తర్వాత వరుస అవకాశాలు రావడం వల్ల ఈ స్థాయిలో ఉన్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన జీవితంలో ‘దేవదాస్’ మూవీ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఎప్పుడొస్తావని ప్రశ్నిస్తున్నారు.






