Shaakuntalam :సమంత ఖాతాలోనే శాకుంతలం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోతుందా?

by Dishanational2 |
Shaakuntalam :సమంత ఖాతాలోనే శాకుంతలం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నాక వరస సినిమాలలో నటిస్తూ బీజీగా ఉంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం మూవీలో సామ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఓ ప్రేమికురాలిగా, భర్తదూరమైన భార్యగా సమంత తన నటనతో ఎంతో ఆకట్టుకుంది.

అయితే ఈ మూవీపై సమంత ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన ఆరోగ్యం సహకరించకపోయినా, వరసగా ప్రమోషన్లలో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇచ్చింది. కాగా, నేడు సినిమా థియేటర్లలో రిలీజై, పాజిటివ్ టాక్ సొంత చేసుకున్నప్పటికీ, సినిమాపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ, అక్కడడక్కడ లాజిక్ మిస్సవ్వడం, గ్రాఫిక్స్ తేలిపోవడం, బోర్ కొట్టించే సీన్స్‌తో మూవీ అంతగా ఆకట్టుకునేలా లేదని టాక్.

దీంతో సమంత అభిమానుల్లో అసహనం మొదలైదంట. తన నటనతో సినిమాను నడిపించినప్పటికీ, శాకుంతలం మూవీ సమంత కెరీర్‌లో డిజాస్టర్‌గా మిగిలిపోతుందేమో అని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇక ఈ మూవీ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాల్సిందే.

Also read: సమంత కోసం విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Next Story

Most Viewed