ఆ స్టార్ హీరో కొడుకుతో తన కూతురు పెళ్లి ఫిక్స్ చేసిన చిరుకు ఊహించని షాక్..ఏమైందంటే?

by Disha Web Desk 8 |
ఆ స్టార్ హీరో కొడుకుతో తన కూతురు పెళ్లి ఫిక్స్ చేసిన చిరుకు ఊహించని షాక్..ఏమైందంటే?
X

దిశ, సినిమా : మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఈ మధ్య మెగా ఫ్యామిలీకి చెందిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా, చిరు కూతుర్ల పెళ్లీ, విడాకుల ఇష్యూస్‌పై అనేక వార్తలు వస్తుంటాయి. కాగా తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అది ఏమిటంటే? చిరంజీవికి తన పిల్లలంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా చిరు తన కూతుళ్ల పెళ్లి విషయంలో చాలా ఆలోచనతో వ్యవహరించే వారు. ఆయన తన పెద్ద కూతురు సుస్మితను ఓ స్టార్ హీరోకు కొడుకుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడంట.

అంతే కాకుండా ఆ హీరో ఇంటికి కోడలిగా పంపిద్దామని ఫిక్స్ అయ్యి ఏకంగా ముహూర్తం కూడా పెట్టించాడంట. కానీ అప్పుడే చిరుకు ఊహించని షాక్ తగిలింది. సుస్మితే మరో యంగ్ హీరోతో ప్రేమలో ఉన్న విషయం తెలియడంతో షాకైన చిరంజీవి, కూతురి సంతోషం కోసం ఆ స్టార్ హీరోకు ఇచ్చిన మాటను రిజెక్ట్ చేసుకున్నాడంట. తర్వాత పెళ్లి కూడా క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. కానీ సుస్మిత తాను ప్రేమించిన హీరోను కాకుండా వాళ్ల పేరెంట్స్ చూసిన మరో సంబంధం చేసుకొని ఇప్పుడు సంతోషంగా గడుపుతోంది. చాలా రోజుల క్రితం ఈ వార్త ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది.

Next Story

Most Viewed