అలాంటి పాత్రలు హీరోయిన్లు ఎందుకు చేయకూడదు.. అందుకే సవాలుగా తీసుకుని చేశా: కామాక్షి భాస్కర్ల

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఊహించని క్రేజ్‌ను రాబట్టుకుంది.

అలాంటి పాత్రలు హీరోయిన్లు ఎందుకు చేయకూడదు.. అందుకే సవాలుగా తీసుకుని చేశా: కామాక్షి భాస్కర్ల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఊహించని క్రేజ్‌ను రాబట్టుకుంది. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, రౌడీ బాయ్స్, వీరూపాక్ష వంటి హిట్ చిత్రాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం కామాక్షి ‘12ఏ రైల్వే కాలనీ’(12A Railway Colony) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను నాని కాసరగడ్డ తెరకెక్కించగా.. అల్లరి నరేష్ (Allari Naresh)హీరోగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నవంబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న కామాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘నేను ఇందేలో నరేష్‌కు జోడీగా ఆరాధన పాత్రలో నటించాను. ఈ పాత్ర లేకపోతే ఈ కథే లేదు. ఈ సినిమా చూశాక మీ అందరికీ నా పాత్ర గుర్తుండిపోతుంది. విజయ్ సేతుపతి, శ్రీవిష్ణు, సుహాస్.. ఇలా చాలామంది హీరోలు అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. హీరోయిన్లు అలా ఎందుకు చేయకూడదని ఓ సవాల్‌గా తీసుకుని ఈ పాత్ర చేశాను. ఇకనుంచి అయినా విభిన్న రకాల పాత్రలో పోషించే ప్రయత్నం చేస్తున్నాను. అలా ఈ ఐదేళ్ల నా ప్రయాణంలో చేసిన విరూపాక్ష, పొలిమేర మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘డెకాయిట్’ చేస్తు్న్నాను. అలాగే ఓ పెద్ద ప్రాజెక్ట్‌లోనూ భాగం అయ్యాను. త్వరలోనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తా. వీటితో పాటు ‘పొలిమేర-3’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story