- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ గెలుపు.. అందరికంటే ఎక్కువ సంతోషించే ముసలమ్మ ఈమేనంట!
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన విన్నింగ్‌ను అందరూ ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ అభిమానులు చాలా

దిశ, సినిమా : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన విన్నింగ్‌ను అందరూ ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ మెంబర్స్, పవన్ అభిమానులు, నటీనటులు ఆయన గెలుపు పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే వారందరికంటే ఎక్కువగా పవన్ గెలుపుని సంతోషించే వ్యక్తి ఒకరు ఉన్నారంట. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తాను అని ఓ మహిళ చెప్పింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆ వీడియోను షేర్ చేస్తూ.. పవన్ విజయాన్ని ఎక్కువ సంతోషించే మహిళ ఈమె, పవర్ స్టార్ ఈ ముసలమ్మను కలవాలి, ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అంటూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే. అలాగే పవన్ 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో విజయం సాధించారు.






